Site icon NTV Telugu

సుకుమార్‌ మరో సాయం: రాజోలులో రూ. 40 లక్షలతో!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. ఆక్సిజన్ దొరకక బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్ తన వంతు ప్రయత్నంగా ప్రజలకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. తన స్వస్థలం కాకినాడకు సమీపంలోని రాజోలు గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో డిప్లాయబుల్ ఆక్సిజన్ కాన్సెంట్రేషన్ సిస్టం 80 ఆక్సిజన్‌ జనరేటర్‌ సిస్టమ్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలుత రూ.25 లక్షలతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్నారు. కానీ ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తే అవసరానికి తగిన ఆక్సిజన్‌ తయారుచేసుకోవచ్చన్న ఉద్దేశంతో సుకుమార్ మరో రూ.15 లక్షలు అదనంగా అందించారు. దీంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

Exit mobile version