NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి సుకుమార్, మైత్రీ నిర్మాతలు

Allu Arjun Sukumar

Allu Arjun Sukumar

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న అరెస్టయి ఒక రాత్రంతా చంచల్ గూడా జైల్లో గడిపిన అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా అక్కడ నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళిన అల్లు అర్జున్ ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురైంది. అల్లు అర్జున్ కూడా భావోద్వేగానికి గురై భార్యాబిడ్డలను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. తాను బాగానే ఉన్నానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని పేర్కొన్న ఆయన ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమీ మాట్లాడలేనని అన్నారు.

Allu Arjun: రేవతి కుటుంబానికి అండగా ఉంటా.. పుష్పరాజ్ హామీ

ఆ రోజు ఘటన అనుకోకుండా జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే రేవతి కుటుంబానికి తన సానుభూతి ఉంటుందని బాధిత కుటుంబానికి ఇప్పటికీ అండగానే ఉంటానని ఆయన అన్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ నివాసానికి పుష్ప 2 దర్శక నిర్మాతలు వెళ్లినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ నివాసానికి పుష్ప నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవికుమార్ తో పాటు పుష్ప దర్శకుడు సుకుమార్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న అరెస్ట్ అయిన దగ్గర నుంచి దిల్ రాజు, మైత్రీ రవి, నాగ వంశీ, త్రివిక్రమ్, అల్లు శిరీష్, బన్నీ వాసు, ధీరజ్ మొగిలినేని వంటి వారు అల్లు అర్జున్ వెంటే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రాఘవేంద్రరావు, రాణా వంటి వారు అల్లు అర్జున్ నివాసానికి వచ్చి వెళ్లారు. ఇక ఇప్పుడు సుకుమార్ సహ మైత్రి నిర్మాతలు నవీన్, రవి అల్లు అర్జున్ నివాసానికి ఆయనను కలిసేందుకు వెళ్లారు.

Show comments