Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ RC17 తాలూకు కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షకులు, అభిమానుల్లో అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పుష్ప2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో.. యావత్ ప్రపంచం ఆర్సీ 17 అప్డేట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు సుక్కు.
కాగా ఇప్పుడు స్క్రిప్ట్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ రామ్ చరణ్‌కు ఫైనల్ నెరేషన్ చేయాల్సి ఉందని సమాచారం. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను రామ్ చరణ్‌కు వినిపించనున్నారz. ఈ నెరేషన్ పూర్తయిన వెంటనే సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్, ఇతర నటీనటుల ఎంపికపై స్పష్టత రానుంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమలు దసరా నాడు గ్రాండ్‌గా పూర్తి చేసి.. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో 2027లో సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లెక్కన 2028లో ఆర్సీ 17 ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ సినిమా నటీనటులతో పాటు షూటింగ్ అప్డేట్ను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. మరి ఈసారి సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!