Site icon NTV Telugu

Hailesso: సుడిగాలి సుధీర్ కోసం ముగ్గురు హీరోయిన్లు!

Hailesso

Hailesso

సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ కొత్త చిత్రం ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం కాగా గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు.

ఈ చిత్రానికి హైలెస్సో అనే ఆకట్టుకునే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. హీరో నిఖిల్ టైటిల్‌ను లాంచ్ చేశారు. బన్నీ వాసు స్క్రిప్ట్‌ను అందజేశారు. దర్శకులు వశిష్ట, చందూ మొండేటి, మెహర్ రమేశ్ కెమెరాను ఆన్ చేయగా, ముహూర్తపు షాట్‌కు వి.వి. వినాయక్ క్లాప్ కొట్టారు. దర్శకుడు ప్రసన్న కుమార్ స్వయంగా యాక్షన్ చెప్పారు. ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌ బ్రహ్మ కడలి, చింతా శ్రీనివాస్ రైటర్. హై లెస్సో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version