NTV Telugu Site icon

`గాలోడు`గా సుడిగాలి సుధీర్!

‘జ‌బ‌ర్ద‌స్త్’ క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ ఆ మ‌ధ్య ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీలో హీరోగా న‌టించాడు. దానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోయినా… సుధీర్ మాత్రం త‌న ప్ర‌య‌త్నం మాన‌లేదు. తాజాగా మ‌రోసారి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలోనే ‘గాలోడు’ సినిమా చేయబోతున్నాడు. సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బుధ‌వారం ఈ కొత్త సినిమాకు సంబంధించిన హీరో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. బుల్లితెర‌పై కామెడియ‌న్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వెండితెర‌పై మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా పేరు తెచ్చుకోవాల‌ని అనుకుంటున్నాడు. అదే క్ర‌మంలో ‘సాప్ట్ వేర్ సుధీర్’ చేసిన సుధీర్ ఇప్పుడు ‘గాలోడు’గా అల‌రించే ప్ర‌య‌త్నం మొద‌లెట్టాడు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూస్తుంటే ఇదేదో సీరియ‌స్ సినిమా అనే అనిపిస్తోంది. సంస్కృతి ఫిలిమ్స్ బ్యాన‌ర్ లో నిర్మితం కాబోతున్న‌ ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.