టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబుప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞాన సాగర్ ద్వారక కధ, కథనం మరియు దర్శకత్వం ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సుదీర్ బాబు తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనకు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. సుదీర్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ ఓటీటీ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.
గత నెలలో ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థలైన ఈటీవీ విన్, ఆహా, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు ఉంచారు. కాగా అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచింది. తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ, మలయాళం, మరియు హిందీ భాషలలో ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ స్ట్రీమింగ్ చేసింది అమెజాన్. కాగా ప్రైమ్ వీడియోలో సుధీర్ బాబు హరోం హర రికార్డు సృస్టించింది. ఇప్పటి వరకు 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని ఇంకా టాప్ లో కొనసాగుతుంది ఈ చిత్రం. థియేటర్లలో ఆకట్టుకొని ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని మిలియన్ వ్యూస్ రాబట్టడంతో సంతోషం వ్యక్తం చేస్తూ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్. ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతూ మరిన్ని రికార్డులు సాధించే దిశగా సాగుతోంది హరోం హర. దీంతో ఆడియెన్స్ థియేటర్స్ కంటే ఇంట్లో కూర్చుని సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారని మరోసారి ప్రూవ్ అయింది.