NTV Telugu Site icon

Sudheer Babu: వాడు ఇలాంటి వాడని తెలియక నా సినిమాలో తీసుకున్నాం.. సుధీర్ బాబు క్షమాపణలు

Sudheer Babu Responds On Praneeth Hanumanthu Issue

Sudheer Babu Responds On Praneeth Hanumanthu Issue

Sudheer Babu Responds on Praneeth hanumanthu Issue: ప్రణీత్ హనుమంతు వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల మీద యూట్యూబ్ లో రివ్యూస్ చేస్తూ వచ్చిన అతనికి హరోంహర అనే సినిమాలో నటించే అవకాశం కూడా దక్కింది. ఈ సినిమాలో విలన్ పాత్రలలో ఒకటి ప్రణీత్ హనుమంతు పోషించాడు. ఇక ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా హీరో సుధీర్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ విషయం మీద స్పందించాడు. మంచో చెడో తెలియదు కానీ నేను సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండను. సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పనులు చేయను. అయితే నాకు ఈ మధ్యనే ఒక విషయం తెలిసింది. అదేంటంటే ప్రణీత్ హనుమంతుని మేము హరోం హరా సినిమాలో నటింప చేశాం.

Kamal Haasan: ఇంకా దొరకని అవార్డ్స్ చాలా ఉన్నాయి..కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు

నా తరఫునుంచి నా టోటల్ టీం తరపు నుంచి ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. మాకు వాడు ఇలాంటి వాడని తెలియదు. ఈ విషయం నాకు పూర్తిగా అవగాహన లేదు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అతని బాగోతం గురించి చెబుతున్నా దాన్ని చూసే ధైర్యం కూడా నాకు లేదు. ఈ సమయంలో అతను మాట్లాడిన దరిద్రాన్ని చూసే ధైర్యం కూడా నాకు కలగడం లేదు. ఇలాంటి వాళ్లు తమ మనసులో ఉన్న కుళ్ళుని బయటపెట్టే ప్లాట్ఫామ్ అనేది లేకుండా చేయాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇది ఏమాత్రం కాదు అంటూ ఆయన స్పందించాడు. ఇక హరోం హర అనే సినిమాని జ్ఞాన సాగర్ ద్వారకా డైరెక్టు చేశాడు. ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పూర్ మాన్ కేజిఎఫ్ అని టాక్ తెచ్చుకుంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఆహలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

Show comments