NTV Telugu Site icon

Sudheer Babu : మా నాన్న సూపర్ హీరో ప్రీమియర్ టాక్..

Suheer

Suheer

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ చిత్ర  ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.

Also Read : Rajnikanth : వేట్టయాన్ ట్విట్టర్ రివ్యూ.. సరే సరే లే ఎన్నెన్నో అనుకుంటాం..

కాగా ఈ చిత్రంపై ఎంతో నమ్మకంగా ఉంది యూనిట్. ఆ నమ్మకంతోనే విడుదలకు రెండు రోజుల ముందుగా ఈ సినిమా ప్రీమియర్స్ ను రెండు తెలుగు రాష్ట్రల్లో సెలెక్టెడ్ థియేటర్స్ లో ప్రదర్శించారు. మరి మా నాన్నా సూపర్ హీరో ప్రీమియర్ టాక్ ఎలా ఉందొ చదివేద్దాం పదండి. టైటిల్ చూడగానే తెలుస్తుంది ఇది ఓ తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ అని. అందుకు తగ్గట్టుగానే కథ, కథనాన్ని రాసుకున్నాడు దర్శకుడు. తానూ రాసుకున్న కథను, చెప్పలనుకున్న పాయింట్ ను ఎక్కడ డివియేట్ అవ్వకుండా చెప్పాడు. సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. ఒక రకంగా సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. కానీ కథలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది. తెరపై భావోద్వేగ సన్నివేశాలు వస్తున్న ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఇక కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ. క్లైమాక్స్ గుడ్ . ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అని పబ్లిక్ టాక్. మరి దసరా రేస్ లో ఏ మేరకు నిలబడుతుందో చూడాలి

Show comments