టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాథలాజికల్, నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా మూవీ ని నిర్మిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం కథాంశంతో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నా ఈ సినిమాతో.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీలో పవర్ ఫుల్ రోల్‌లో ఆమె కనిపించబోతున్నట్లు ఆమె లుక్ చూస్తే తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది..
Also Read : Odela2 : రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలో ఓదెల 2 .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !
ఇక ఈ సినిమాలో విలన్ గా రోహిత్ పాఠక్ నటిస్తున్నాడు. ‘ఖాకీ’, ‘సీటీమార్’,‘సీతా రామం’, ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ సినిమాల్లో తన విలనిజంతో ఆకట్టుకోని తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాలో కూడా ఓ విలన్ గా నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘జటాధర’ లో రోహిత్ కి భార్య పాత్రలో మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కనిపించనుందట. ఈమె రోల్ కూడా చాలా పవర్ఫుల్‌గా ఉంటుందని సమాచారం. త్వరలోనే ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా వదిలే అవకాశం ఉంది.
