Site icon NTV Telugu

దాతృత్వాన్ని చాటుకున్న సినీ నటుడు సుధీర్ బాబు

సినీ నటుడు సుధీర్ బాబు దాతృత్వాన్ని చాటుకున్నారు. రెండున్నర నెలల చిన్నారి సంస్కృతి జాస్మిన్ పేరిట లక్షన్నర నగదు డిపాజిట్ చేశారు సుధీర్ బాబు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన సంస్కృతి జాస్మిన్ పుట్టుకతోనే గుండెసమస్యతో బాధపడుతుంది. ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాల్సి ఉండగా.. సంస్కృతికి గతంలో లక్షా 70 వేలు ఖర్చు చేసి వైద్యం అందేలా సహాయపడ్డాడు సుధీర్ బాబు. తాజాగా ఆయన లక్షన్నర నగదు డిపాజిట్ చేశారు.

ప్రస్తుతం సుధీర్ బాబు పలాస దర్శకుడు కరుణాకర్ దర్శకత్వంలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ అనే టైటిల్ తో వస్తున్నారు.

Exit mobile version