‘హమ్ హే రాహీ ప్యార్ కీ’, ‘చైనా గేట్’ లాంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న వెటరన్ యాక్టర్ కేడీ చంద్రన్ ఆదివారం మరణించారు. కిడ్నీ సంబంధమైన సమస్యల కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో గుండెపోటుకి లోనై ఆయన తుది శ్వాస విడిచారు. 84 ఏళ్లే కేడీ చంద్రన్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
దివంగత కేడీ చంద్రన్ వారసురాలే… తెలుగు వారికి కూడా బాగా పరిచయం ఉన్న నటీ సుధా చంద్రన్. ‘’మళ్లీ ఎప్పటికైనా నీ కూతురుగానే పుట్టాలి అని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా!’’ అంటూ ఆమె ప్రత్యేకంగా ఇన్ స్టాగ్రామ్ లో తండ్రి కోసం పోస్ట్ రాశారు. తన దుఃఖాన్ని నెటిజన్స్ తో పంచుకున్న ఆమె ‘తండ్రి లేని లోటు తీరనిది’ అన్నారు. అలాగే, కేడీ చంద్రన్ చూపిన దారిలోనే తాను ఇక మీదట కూడా ప్రయాణిస్తాననీ, ఆయన నేర్పిన జీవన సూత్రాలు తుది శ్వాస దాకా పాటిస్తానని సుధా చంద్రన్ అన్నారు.
‘’నాన్న! మళ్లీ నీ కూతురుగానే పుడుతాను…’’ అంటోన్న సీనియర్ నటి
