NTV Telugu Site icon

AjithKumar: విదాముయార్చి షూటింగ్ అప్‌డేట్..తరువాతి షెడ్యూల్ ఎక్కడంటే..?

Untitled Design (7)

Untitled Design (7)

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విదాముయార్చి‘. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అజిత్ కు జిడిగా త్రిష నటిస్తుంది. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ ఫస్ట్ మరియు సెకండ్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా అజిత్ మరియు త్రిష కృష్ణన్ లకి సంబందించిన పోస్టర్ ను సినిమాఫై మరింత ఆసక్తిని పెంచింది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవల అజర్ బైజాన్ కీలక షెడ్యూల్ ను టీమ్ పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్స్, వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది నిర్మాణ సంస్థ. కాగా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుందని తెలిపింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో హీరో అజిత్, హీరోయిన్ త్రిషాలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ ను కూడా చిత్రీకరించనున్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ నుండి రీమేక్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది చిత్ర యూనిట్.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ‘విదాముయార్చి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అర్జున్, రెజీనా కసాండ్రా మరియు ఆరవ్ కీలక పాత్రలు పోషిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. వీలైనంత త్వరగా ఘాటింగ్ ముగించి డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టాలని భావిస్తోంది యూనిట్. దీపావళి కానుకగా అక్టోబరు లేదా నవంబరులో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు లైకా అధినేత సుభాస్కరన్

Also Read: Chaitanya Reddy : హనుమాన్ మేము అనుకున్నంత కలెక్షన్లు రాలేదు..

Show comments