Site icon NTV Telugu

స్టార్స్ కి తాప్సీ అంటే భయమా!?

దక్షిణాదిన నటిగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది తాప్సీ. అక్కడ ‘పింక్, జుడ్వా 2, తప్పడ్’ వంటి సినిమాలతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇటీవల ‘రష్మీ రాకెట్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన తాప్సీ గ్లోబల్ యంగ్ లీడర్స్ సమ్మిట్ 2021లో పాల్గొంది. వారితో జరిపిన చాట్‌లో స్టార్స్ కొందరు తనతో సినిమాలు చేయడానికి వెనుకాడుతున్నారని వెల్లడించింది. టాప్ లో ఉన్న నటీనటులే కాదు కొత్తవాళ్లు సైతం తనతో కలసి నటించటానికి సంకోచిస్తున్నట్లు వెల్లడించింది.

పేరు చెప్పకుండా ఓ నటుడు తనతో సినిమా చేయడానికి నిరాకరించినట్లు తెలుపుతూ… తను ద్విపాత్రాభినయం కూడా చేస్తున్న విషయం తెలుసుకుని ‘ఏక్ తాప్సీ కో సంభాల్నా ముష్కిల్ హోతా హై, యహాన్ తో దో హై’ (ఒక్క తాప్సీనే భరించటం కష్టం… ఇక ఇద్దరితోనా) అని కామెంట్ చేసిన విషయాన్ని గుర్తు చేసింది.

ఇక ఇంకోనటుడు ‘ఈ సినిమా చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే చివరికి సానుభూతి మొత్తం అమ్మాయికి వెళుతుంది’ అని చెప్పినట్లు తెలియచేశారు. నిజానికి అదో ప్రేమకథ. అదీ కాక అతనో పెద్ద స్టార్ కూడా. అలాంటి నటుల్లో కొంచెం ఆత్మవిశ్వాసాన్ని కోరుకుంటున్నానని తాప్పీ వ్యాఖ్యానించింది. ఇటీవల దర్శకనిర్మాతలతో సమావేశమైన ప్రతి
సారి తనతో నటించే నటీనటులు కేవలం ఒకటి రెండు సినిమాలు చేసినవారే కనిపిస్తున్నట్లు తెలియచేశారు. ప్రస్తుతం తాప్సీ ప్రతిక్ గాంధీ సినిమాతో పాటు ‘శభాష్ మిత్’, ‘లూప్ లపేటా, వో లడ్కీ హై కహాన్’ వంటి సినిమాలలో నటిస్తోంది.

Exit mobile version