Site icon NTV Telugu

SS Thaman: పుష్ప 2 విషయంలో పెదవి విప్పిన థమన్

Thaman

Thaman

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి కాలేదు..సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఇంకా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పూర్తిగా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మరో ఇద్దరు సంగీత దర్శకులు పని చేయబోతున్నారు అని ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ విషయం మీద తమన్ స్పందించాడు.

Daaku Maharaj: గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజు ఈ డాకు మహారాజ్

నిజానికి ముందు నుంచి తమన్ తో పాటు అజనీష్ లోకనాథ్ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో పనిచేస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా జరిగిన డాకు మహారాజ్ టైటిల్ రివిల్ ఈవెంట్లో తమన్ ఈ విషయం మీద స్పందించాడు. నేను పుష్ప 2 సినిమా చూశాను. ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో నేను ఒక భాగానికి పనిచేశాను. 15 రోజుల్లో మొత్తం సినిమా చేయడం అంటే కుదిరే పని కాదు కాబట్టి నేను ఎంత వరకు చేయగలనో అంతవరకు చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పటివరకు తమన్ గురించి దేవి శ్రీ ప్రసాద్ గురించి పుష్ప 2 విషయంలో జరిగిన అనేక ప్రచారాలకు ఇప్పుడు బ్రేకులు పడ్డట్టు అయింది.

Exit mobile version