గత తరం దర్శకులతో పోలిస్తే ఈ తరం దర్శకులు చాలా స్పీడ్ గా ఉన్నారు. నానితో దసరా అనే ఒక సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల ది పారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి సినిమా అనౌన్స్ చేయడం షాక్ కాదు అతను తీసుకున్న కథ, నానిని ప్రజెంట్ చేయబోతున్న విధానం గురించి టాలీవుడ్ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హీరోని తల్లి క్యారెక్టర్ చేతనే ఒక బూతు పదంతో ప్రస్తావిస్తూ కట్ చేసిన గ్లింప్స్ టాలీవుడ్ వర్గాలలో చర్చనీయాంశమయింది. సోషల్ మీడియాలో మీడియాలో మాత్రం ఒక రేంజ్ వేవ్ క్రియేట్ చేసింది. కొంతమంది ఇదేంట్రా అని పెదవి విరుస్తుంటే కొంతమంది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ బహిరంగంగానే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు ఇలాంటి డేరింగ్ స్టెప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడంతో అసలు అతని కాన్ఫిడెన్స్ ఏంటి అని చర్చ జరుగుతోంది.
PM Modi: ఊబకాయాన్ని ఓడించి.. ఫిట్‌గా ఉండేందుకు మంత్రం చెప్పిన ప్రధాని మోడీ..
ఇదే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్నప్పుడు అతని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అది కంటెంట్ అని తెలుస్తోంది. అలాంటి కంటెంట్ తో కథ చెప్పాడు, కాబట్టే నానీలాగా జడ్జిమెంట్ పవర్ ఎక్కువ ఉన్న హీరో ఆ సినిమా ఒప్పుకున్నాడని లేకపోతే క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నాని ఒక బూతు పదంతో తనను తాను పిలిపించుకుంటాడా? అని అంటున్నారు. ఈ విషయం మీద ట్రోల్స్ వస్తున్నాయని తెలిసి తగ్గేది లేదు అంటూ తర్వాత రోజు మరో పోస్ట్ పెడతాడా? ఇదంతా శ్రీకాంత్ ఓదెల రాసుకున్న కదా కంటెంట్ ను చూసే నాని కూడా ఒక రేంజ్ లో హ్యాపీగా ఉన్నాడని చెబుతున్నారు. నాని కెరీర్ లో ది బెస్ట్ మూవీ గా హైయెస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం నానీకి అనుమానాలు లేవని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా కేవలం పాన్ ఇండియా ఐదు భాషల్లోనే కాదు. మొత్తం ఎనిమిది భాషలలో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
