Site icon NTV Telugu

తాప్సి స్పోర్ట్స్ డ్రామాకు డైరెక్టర్ చేంజ్ ?

Srijit Mukherji replaces Rahul Dholakia as director of Mithali Raj

క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ “శభాష్ మిథు” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ బయోపిక్ లో మిథాలీ రాజ్ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను, క్రికెట్ కెరీర్‌లో సాధించిన హిస్టరీని ఇందులో చూపించనున్నారు. అయితే వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్ ను చేంజ్ చేస్తున్నారట. మొదట రాహుల్ ధోలాకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో దర్శకుడిగా శ్రీజిత్ ముఖర్జీ అడుగు పెట్టారు. శ్రీజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

Read Also : ప్రియుడే కారణం అంటున్న చిన్నారి పెళ్లికూతురు…!!

అయితే ఈ మార్పుకు కారణమేంటో తెలియరాలేదు. మహిళల క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్న మిథాలీ రోల్ లో నటించడానికి తాప్సి క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా మరోవైపు తాప్సి నటించిన ‘హసీన్ దిల్ రుబా, రశ్మి రాకెట్’ చిత్రాలు ఓటిటి విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

Exit mobile version