‘కోర్ట్’ మూవీ ద్వారా పరిచయమైన ఈ యువ హీరోయిన్ శ్రీదేవి. తన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించి, బోలెడన్ని ప్రశంసలు అందుకున్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన కోర్ట్ డ్రామా లో జాబిలి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె అమాయకపు నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా, నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. కేవలం రూ.10 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
Also Read : Aasif Khan : హార్ట్ అటాక్‌తో ఆసుపత్రిలో చేరిన నటుడు.. ‘జీవితం చాలా చిన్నది’ అంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
ఇక తాజాగా శ్రీదేవి తన జీవితంలో ముఖ్యమైన డ్రీమ్‌ని సాకారం చేసుకున్నారు. తన ఫస్ట్ మూవీ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ లగ్జరీ ఎంజీ కారును కొనుగోలు చేశారు. కుటుంబసభ్యులతో కలిసి కారుతో ఫోటోలు దిగారు.. ‘కారు కొనడం నా కల.. ఎట్టకేలకు తీరింది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “ఫస్ట్ సినిమాకే కారు కొంటే, రెండో సినిమాకే ఇల్లు కొంటుంది!” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవికి వరుసగా కొత్త సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఒక తమిళ చిత్రానికి ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలో కోలీవుడ్‌లోనూ తన ప్రతిభను చూపించనున్న ఈ యువ తార, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు.
