Site icon NTV Telugu

Sritej: శ్రీ తేజ హెల్త్ బులిటెన్ విడుదల.. పైపుల ద్వారా ఆహారం

Srritej

Srritej

Sritej:  సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను కిమ్స్‌ వైద్యులు విడుదలచేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే ఊపిరి తీసుకోగలుగుతున్నాడని వైద్యులు వెల్లడించారు. శ్రీతేజ్‌కు లిక్విడ్ ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. అతనికి జ్వరం తగ్గుముఖం పడుతోందని.. తెల్లరక్తకణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పైపు ద్వారానే ఆహారాన్ని అందిస్తున్నట్లు హెల్త్‌బులెటిన్‌లో వైద్యులు వివరించారు.

Air India: తొలి ఫ్లైట్ జర్నీలో మద్యం, ఫుడ్ ఖాళీ చేసేసిన సూరత్ ప్యాసింజర్స్!

అంతేకాక ఫుడ్ తీసుకోగాలుగుతున్నాడని వెల్లడించారు. అయితే నాడీ వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉందని పేర్కొన్నారు. ఇక తాజాగా శ్రీ తేజ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి కొన్ని సూచనలు చేశారు. ఇక మంత్రి కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో పుష్ప 2 నిర్మాతలు యెర్నేని నవీన్, రవి శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ కి చేరుకున్నారు..ఇక నిర్మాతలు యెర్నేని నవీన్, రవి.. మంత్రి సమక్షంలో 50 లక్షల చెక్ నీ బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రస్తుతం శ్రీ తేజ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Exit mobile version