Site icon NTV Telugu

Sreeleela : ఫ్యాన్ బాధను తీరుస్తూ ..హృదయాన్ని హత్తుకున్న శ్రీలీల రిప్లై

Sreelela

Sreelela

టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజ్‌ ఎక్కువగా ఉన్న హీరోయిన్‌లలో శ్రీలీల ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె, పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ, వరుసగా హిట్ చిత్రాలతో కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న ఆమె ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను పెంచుకుంటోంది. ప్రస్తుతం శ్రీ లీల, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఇతర పెద్ద ప్రాజెక్టులతో కూడా శ్రీలీల బిజీగా ఉన్నారు.

Also Read : Shobana: హిజ్రా క్యారెక్టర్ చేయడం నా కల – సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

అయినా కూడా తన అభిమానుల కోసం ఎప్పుడూ సమయం కేటాయించే లీల, తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల ఇన్‌స్టాలో చాట్ సెషన్ నిర్వహించిన ఆమెకు ఒక అభిమాని “నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను” అని మెసేజ్ పంపాడు. దానికి శ్రీ లీల స్పందిస్తూ..“నేను హెల్ప్ చేయగలనో లేదో తెలియదు కానీ.. వెంటనే వెళ్లి మీ కుటుంబ సభ్యుడిని హత్తుకోండి. నేను కూడా అలాగే చేస్తాను. అలాగే మంచి సంగీతం వింటే అది థెరపీలా పనిచేస్తుంది” అని రిప్లై ఇచ్చారు. ఈ జవాబు అభిమానులు బాగా ఆకట్టుకుంది. ఫ్యాన్‌ భావోద్వేగాన్ని అర్థం చేసుకుని, అతని బాధను తగ్గించేలా స్పందించిన తీరు అందరినీ హత్తుకుంది. సినిమాల విషయానికొస్తే, త్వరలో శ్రీలీల నటించిన ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అలాగే, కోలీవుడ్‌లో శివకార్తికేయన్‌తో పరాశక్తి, బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో మరో చిత్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులతో శ్రీలీల క్రేజ్‌ మరింత పెరుగుతోంది.

Exit mobile version