ఇండస్ట్రీలో హీరోయిన్‌ల పోటీ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ, క్రేజ్ సంపాదించుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. ప్రస్తుతానికి టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు శ్రీలీల మరియు భాగ్యశ్రీ బొర్సె. వీరిద్దరూ తమదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. శ్రీలీల తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో దూసుకుపోతుంటే.. భాగ్యశ్రీ మాత్రం టాలీవుడ్‌పైనే దృష్టి సారిస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే ప్రాజెక్ట్ కోసం రేసులో ఉన్నారన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Pooja-Hegde : టాలీవుడ్‌కి కమ్‌బ్యాక్ చేస్తున్న పూజా హెగ్డే.. షాకింగ్ రెమ్యునరేషన్
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కొత్త సినిమా కోసం ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం. క్లాసిక్ హిట్ ఏప్రిల్ 1 విడుదలలోని సూపర్ హిట్ సాంగ్ ‘‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా..’’ అందరికీ గుర్తుండేలా ఉంటుంది. ఇప్పుడు ఆ పాట మొదటి లైన్‌ను టైటిల్‌గా రిజిస్టర్ చేయించారని సినీ సర్కిల్స్ టాక్. ఈ టైటిల్‌తో తెరకెక్కబోయే సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే ఫైనల్ అయ్యిందని, దర్శకుడు కూడా రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌గా తెరకెక్కనుందట. ఇందులో హీరోయిన్ పాత్రకు భారీ స్కోప్ ఉండబోతోందని సమాచారం. దీంతో ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే అంశం మీద ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ కీలక పాత్ర కోసం శ్రీలీల పేరు బలంగా వినిపిస్తుండగా, మరోవైపు భాగ్యశ్రీ బొర్సె కూడా రేసులో ఉన్నారని టాక్. టాలీవుడ్‌లో శ్రీలీలకు ఉన్న క్రేజ్, యూత్‌లో భాగ్యశ్రీ గ్లామర్ ఫాలోయింగ్.. ఈ ఇద్దరినీ సమాన స్థాయిలో రేసులో నిలిపాయి. ఇక నిర్మాతల ఫైనల్ డిసిజన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. చివరికి ఈ “చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా” అనే క్రేజీ టైటిల్ సినిమాకి లక్కీ హీరోయిన్ ఎవరో త్వరలోనే క్లారిటీ రానుంది.
