టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పెళ్లి సందడి సినిమాతో ఎంతగానో మెప్పించిన శ్రీలీల ఆ తరువాత వచ్చిన “ధమాకా” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ చిత్రంలో శ్రీలీల డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో శ్రీలీల కు వరుసగా ఆఫర్స్ వచ్చాయి.టాలీవుడ్ లో ఈ భామ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ అందుకుంది.కానీ ఈ భామ నటించిన దాదాపు ఐదు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ప్రస్తుతం ఈ భామకు ఆఫర్స్ తగ్గాయి.ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే వుంది..వరుసగా సినిమాలు చేసిన శ్రీలీలకు.. హిట్‌ల కంటే ఫ్లాపులే ఎక్కువగా వచ్చాయి.. శ్రీలీల చేసిన సినిమాల్లో కేవలం డాన్స్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చింది.పెర్ఫార్మన్స్ పాత్రలు ఆమెకు రాలేదు. ఒక్క భగవంత్ కేసరి సినిమా మినహాయించి మిగతా సినిమాలేవి శ్రీలీలకు పెద్దగా కలిసి రాలేదు. చివరగా వచ్చిన గుంటూరు కారంలో శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసింది. అంతే తప్ప ఈ సినిమా మరో కొత్త ఆఫర్‌ను మాత్రం ఆమెకు తీసుకురాలేదు.
దీంతో ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రీలీల ఇక నుంచి పెర్ఫార్మన్స్ రోల్స్ చేయాలనుకుంటుంది.ఇదే సమయంలో ఈ భామకు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మూవీలో ఛాన్స్ వచ్చిందనే వార్త తెగ వైరల్ అవుతుంది .మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాని అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో అజిత్ సరసన హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఈ కాంబో ఎలా సెట్ అవుతుందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఏజ్ పరంగా చూస్తే. శ్రీలీల,అజిత్ ఇద్దరి మధ్య ఏకంగా 30 ఏళ్ల గ్యాప్ ఉంది. కాబట్టి అజిత్ పక్కన శ్రీలీల సెట్ అవడం కష్టమేనని తెలుస్తుంది.ఒకవేళ ఈ సినిమాలో ఈ భామకు ఆఫర్ వచ్చినట్లు అయితే అది ఓ కీలక పాత్రకోసం అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.మరి శ్రీలీల కు ఎలాంటి ఆఫర్ వచ్చిందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాలి .
