NTV Telugu Site icon

ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ‘శ్రీకారం’

Sreekaram Now Streaming on SUN NXT

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంపై ఉప రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ గా మాత్రం నిలవలేకపోయింది. ఈ చిత్రంతో బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీకారం’ ఇప్పుడు ప్రముఖ ఓటిటిలో ప్రసారం అవుతోంది. ఈరోజు నుంచి సన్‌నెక్స్ట్‌ యాప్‌లో ‘శ్రీకారం’ ప్రసారం అవుతుంది. ఒక సాఫ్ట్ వేర్ యువకుడు రైతుగా మారి, ఆధునిక వ్యవసాయం చేసి లాభాలు ఎలా గడించాడు అన్నదే సినిమా కథ.