NTV Telugu Site icon

‘రాజ రాజ చోర’ టీజర్: ఆకట్టుకున్న టీజ‌ర్ కటింగ్ విధానం

యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా, మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా.. హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. పూర్తి కామెడీ జోన‌ర్ లో సాగే సినిమాగా టీజర్ బట్టి తెలుస్తోంది. ఈమధ్య కాలంలో వచ్చిన శ్రీ విష్ణు సినిమాలన్ని కామెడీ నేపథ్యంలోనే సాగడం విశేషం. ఆయన నటించిన సినిమాల్లో ‘బ్రోచేవారెవ‌రురా’ మంచి క్రైమ్ కామెడీ సినిమాగా మిగిలింది. అప్పటినుంచి శ్రీ విష్ణు ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ కూడా ఆకట్టుకుంటుంది. టైటిల్ కు తగ్గట్టుగానే దొంగతనాల నేపథ్యంలో వస్తున్న సినిమా అని అర్థమైనప్పటికీ.. టీజ‌ర్ క‌ట్ చేసిన విధానం రొటీన్ కు భిన్నంగానే వుంది. మేఘా ఆకాష్ తోను రొమాన్స్ బాగానే ఉండనున్నట్లు టీజర్ బట్టి తెలుస్తోంది. వివేక్‌ సాగర్‌ సంగీతం ఆకట్టుకుంది. మరి ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

Raja Raja Chora Teaser | Sree Vishnu, Megha Akash, Sunainaa | Hasith Goli | Zee Cinemalu