NTV Telugu Site icon

Minugurulu: ‘మిణుగురులు’కి పదేళ్లు… అమెరికాలో స్పెషల్ షో!

అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014 లో తెరకెక్కిన ‘మిణుగురులు’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆశిష్ విద్యార్థి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్ * దీపక్ సరోజ్ నటించిన ఈ సినిమా రిలీజ్ అయి ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేశారు మేకర్స్. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుండి ప్రశంసలందుకున్న ఈ సినిమాలోని సామాజిక అంశాలను, సాంకేతిక విలువలని మెచ్చుకున్నారు. ఇక స్పెషల్ ప్రీమియర్ సందర్భంగా కృష్ణంశెట్టి మాట్లాడుతూ, “2014లో సినిమా విడుదలైనప్పుడు సోషల్ మీడియా పెద్దగా వ్యాప్తి చెందలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలయ్యుంటే జాతీయ అంతర్జాతీయ మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా అందరి నోటా ఒకే మాటగా వెళ్ళేదన్నారు.

Also Read: Anupama Parameswaran: పెళ్లికూతురులా ముస్తాబైన అనుపమ పరమేశ్వరన్…

ఈ సినిమాలోని సామాజిక విషయాలు పూర్తిగా పరిశోధించి, నిజ జీవితంలో చూపు లేని పిల్లల దయనీయ పరిస్థితిని చూపించడం జరిగిందన్నారు. ఈ ‘మిణుగురులు’ 18వ అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ‘గోల్డెన్ ఎలిఫెంట్’ గెలుచుకుంది, ఇండియా అంతర్జాతీయ డిసెబిలిటీ ఫిలిం ఫెస్టివల్ మరియు ఇతర ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి ఎంపికైంది. 9వ బెంగళూరు అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ‘ఉత్తమ చిత్రం’ అవార్డు గెలుచుకుంది. 2014 లో ‘అస్కార్స్’ కి ఉత్తమ చిత్ర జాబితాలో ఎంపికయిన చిత్రాల్లో ‘మిణుగురులు’ కూడా ఉంది. ఆస్కార్ గ్రంథాల్లో శాశ్వత చిత్రాల జాబితాలో ‘మిణుగురులు’ కథ కూడా ఉంటుంది. ఇక ఈ సినిమా దర్శకుడు నేటి పరిస్థితులకి తగ్గట్టుగా ఉండే రొమాంటిక్ ప్రేమ కథ తో ’24 కిస్సెస్’ అనే చిత్రాన్ని తీశారు. ఇక ఇపుడు ఆయన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వనున్న గ్లోబల్ అలాగే ఓటిటి సినిమాలు చేస్తున్నాడు.