టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఒక బయోపిక్ తెరకెక్కనున్నట్లు.. గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గంగూలీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తన బయోపిక్ గురించి కీలక విషయాలను వెల్లడించారు. 2026 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవుతుందని, సినిమా పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అంతేకాదు..
Also Read : Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..!
ఈ బయోపిక్‌లో గంగూలీ పాత్రను బాలీవుడ్ స్టార్ నటుడు రాజ్‌కుమార్ రావు పోషించనున్నారని గంగూలీ స్పష్టంగా తెలిపారు. ఇప్పటికే నటుడు కొన్ని రోజులుగా ఈ పాత్ర కోసం ప్రిపరేషన్‌లో ఉన్నారట. ఈ పాత్రకు తగినంత న్యాయం చేయగల నటుడిగా రాజ్‌కుమార్ రావును ఎంపిక చేయడం పై అభిమానులు సంతృప్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని గంగూలీ తెలిపగా.. స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే సినిమాకు సంబంధించిన అన్ని పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. షూటింగ్ ఎక్కువ సమయం పడకపోయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రం కొంత సమయం పట్టవచ్చని ఆయన చెప్పారు.
ఇక ఈ మూవీ కేవలం క్రికెట్ పరంగా కాదు.. గంగూలీ జీవితంలో జరిగిన వివిధ మలుపులు, విజయాలు, ఎదురుదెబ్బలు అన్నీ కలగలిపి తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ బయోపిక్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. టీమిండియా జెర్సీ లోని ఓ క్రుషియల్ కాలం, బీసీసీఐ అధ్యక్షుడిగా చేసిన సేవలు వంటి ఎన్నో కోణాల్లో ఈ బయోపిక్ ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, 2026లో ప్రారంభమయ్యే ఈ బయోపిక్‌ని వెండితెరపై చూడబోతునందుకు క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
