ఆపద వచ్చింది అంటే ఆదుకోవడంలో ముందుండే నటుడు సోనూ సూద్. సినిమాల విషయం పక్కన పెడితే, సాయం చేయడంలో ఆయన చేయి ఎప్పుడు పైనే ఉంటుంది. ఇప్పటికే ఎంతో మందికి జీవితం ఇచ్చిన సోనూసూద్ ఇంట్లో చెడు జరిగింది. తాజాగా ఆయన భార్య సోనాలి ప్రయాణిస్తున్న కారు హైవేపై యాక్సిడెంట్‌కు గురైంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో సోనాలి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆమెతో పాటు ఆమె అక్క కొడుకు కూడా కార్ లోనే ఉన్నాడు.అతనికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం ఉదయం సోనాలి తన అక్క కుమారుడు, మరో మహిళతో కలిసి ముంబై- నాగ్‌పూర్ హైవేపై కారులో వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read:Jr. NTR : నందమూరి తారక ‘రాముడు’ తో ఉన్న ‘లక్ష్మణుడు’ ఎవరంటే.?
వీరు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది. గాయాలపాలైన వారిద్దరూ ప్రస్తుతం మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రమాదం జరిగిందని తెలియగానే సోనూసూద్ హుటాహుటిన నాగ్‌పూర్ చేరుకోగా. ప్రస్తుతం భార్య బాగోగులు చూసుకుంటూ ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఈ సంఘటన పై సోనూసూద్ స్పందించారు. ‘ సోనాలి ఇప్పుడు బాగానే ఉంది. అదృష్టం వల్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడింది. ఓం సాయి రాం’ అని అన్నారు.మంచి మనుష్యులకు ఎప్పుడు మంచే జరుగుద్ది అనడానికి ఇదే నిదర్శనం. సోనూసూద్ మంచి మనసే అతని భార్యని ప్రమాదం నుండి కాపాడింది. కరోనా టైం లో కొన్ని లక్షల మందికి ఆయన సాయం చేశారు. సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక విషయం తెలిసి ఆయన అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
❤️🙏 pic.twitter.com/P7lnOYYTiM
— sonu sood (@SonuSood) March 26, 2025