Site icon NTV Telugu

గ్రామాలకు ఫ్రీజర్ బాక్సులు అందిస్తున్న సోనూసూద్!

Sonu Sood serving freezer boxes to villages

ప్రజల ప్రాణాలను కాపాడటమే కాదు… విధివశాత్తు కన్నుమూసిన వ్యక్తుల అంత్యక్రియలు సైతం గౌరవ ప్రదంగా జరిగేందుకు చేయూతనిస్తున్నాడు నటుడు, మానవతా వాది సోనూసూద్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ఎంపిక చేసిన గ్రామాలకు ఆయన మృతదేహాలను భద్రపరిచేందుకు డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఇస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత సంకిరెడ్డి పల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వకల్, మద్దికెర వంటి కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు సోనూనూద్ ను ఇటీవల కలిసి, తమ గ్రామానికి చెందిన వ్యక్తులు కన్నుమూస్తే… గతంలో సమీప పట్టణాలను నుండి ఫ్రీజర్ బాక్సులను తెప్పించుకుని, సంబంధీకులు వచ్చేవరకూ మృతదేహాలను భద్రపరిచేవారమని, కానీ ప్రస్తుతం అవి లభ్యం కావడంలేదని వాపోయారు. దాంతో సోనూసూద్ ఆయా గ్రామాలలో మృతదేహాలను భద్రపరచడం కోసం ఫ్రీజర్ బాక్సులను అందిస్తానని హామీ ఇచ్చారు.

Exit mobile version