NTV Telugu Site icon

మరో అరుదైన గౌరవం అందుకున్న సోనూసూద్

నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో వలసకూలీలకు అండగా నిలిచి దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. విపత్తు సమయంలో సోనూ చేసిన సేవా కార్యక్రమాలకు అభినందనలతో పాటుగా.. పలు అవార్డులు ఆయనకు దక్కాయి. అయితే తాజాగా సోనూసూద్ కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. వ‌చ్చే ఏడాది ర‌ష్యాలో జ‌ర‌గ‌బోయే స్పెష‌ల్ ఒలింపిక్స్ వ‌రల్డ్ వింట‌ర్ గేమ్స్‌కు భార‌త్ త‌ర‌పున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక‌య్యారు. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. ‘స్పెష‌ల్ ఒలింపిక్స్ భార‌త్ జ‌ట్టు త‌ర‌పున చేరినందుకు ఆనందంగా, గ‌ర్వంగా ఉంద‌ని.. ఇది త‌న‌కెంతో ప్ర‌త్యేక‌మ‌ని’ సోనూ తెలిపారు.