Site icon NTV Telugu

Sonakshi Sinha: పెళ్లై వారం కూడా కాలేదు..మొగుడితో చెప్పులు మోయిస్తోంది!

Sonakshi Sinha Shares Video Of Husband Zaheer Iqbal Carrying Her Heels,

Sonakshi Sinha Shares Video Of Husband Zaheer Iqbal Carrying Her Heels,

Sonakshi Sinha shares video of husband Zaheer Iqbal carrying her heels: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకి ఆమె చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏడేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 37 ఏళ్ల సోనాక్షి 35 ఏళ్ల జహీర్ భార్యగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇంకా పెళ్లి జరిగి వారం కూడా పూర్తి కాలేదు. హిందూ-ముస్లిం పెళ్లి కాబట్టి తెర మీకు వచ్చినప్పటి నుంచి చాలా వివాదాలను సృష్టించింది. అయితే ఏడేళ్లుగా ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. అయితే మతాంతర వివాహం కావడంతో ఇరువర్గాల సోషల్ మీడియా జనం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి తర్వాత సోనాక్షి మతం మారుతుందని పుకార్లు వచ్చినప్పటికీ, ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు సోనాక్షి సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఇద్దరూ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తూ కనిపించారు.

Jabardast Shabeena: ఎఫ్ 2లో రాజ్ తరుణ్.. జబర్థస్త్ షబీనా వారం రోజుల ట్రోల్ స్టఫ్

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ వీడియోలో సోనాక్షి భర్త జహీర్ సోనాక్షి చెప్పులు పట్టుకున్నాడు. ఈ పోస్ట్‌ షేర్ చేస్తూ మీరు ఇష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇలాగే జరుగుతుందని సోనాక్షి కామెంట్ చేసింది. ఇది చూసిన చాలా మంది ఈ జంటపై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ జంట మాత్రం వాటిని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి.. పెళ్లి తర్వాత సోనాక్షి మతం మారుతోందని పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. జహీర్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ పెళ్లికి హిందూ లేదా ముస్లిం ఆచారాలు లేవు. ఇది పౌర వివాహం, పెళ్లి తర్వాత ఆమె ఇస్లాం మతంలోకి మారుతుందన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. వారిద్దరి హృదయాలు ఒక్కటయ్యాయి. ఇందులో మతానికి తావు లేదు. సోనాక్షి మతం మారదు. నేను మానవత్వాన్ని నమ్ముతాను. భగవంతుడిని హిందువులు భగవాన్ అని, ముస్లింలు అల్లా అని పిలుస్తారు. కానీ చివరికి మనమందరం మనుషులం. జహీర్, సోనాక్షికి నా ఆశీస్సులు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆయన అన్నారు.

Exit mobile version