కోవిడ్ -19 సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ;లాక్ డౌన్ విధించగా… మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇంట్లో ఉండడం ఇప్పుడు అభిరుచిగా మారిందని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఇంట్లో ఉండడమే తన కొత్త హాబీనట. టీకాలు వేసి కోవిడ్‌ను తరిమికొట్టాలని ఆమె అందరినీ కోరారు. ఈ 33 ఏళ్ల బ్యూటీ నుండి చేసిన పోస్ట్ కు అతి తక్కువ సమయంలోనే లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి. తన కొత్త హాబీని తెలుపుతూ సోనాక్షి బూడిదరంగు ట్యాంక్ టాప్‌లో ఓపెన్ హెయిర్‌తో ఉన్న పిక్ ను షేర్ చేసింది. ఇక సోనాక్షి వర్క్ విషయానికొస్తే… తన డిజిటల్ ఎంట్రీ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసింది. జోయా అక్తర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోనాక్షి ఇటీవల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ “బుల్బుల్ తరంగ్” ను ప్రకటించింది. ఇది ఓటిటిలో విడుదల కానుంది. అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్, నోరా ఫతేహి కలిసి నటించిన “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా”లో కూడా సోనాక్షి కనిపించనుంది. “ఫాలెన్”తో వెబ్ సిరీస్ అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది. ఇందులో పోలీస్ గా నటిస్తోంది సోనాక్షి సిన్హా.
కరోనా టైములో సోనాక్షి కొత్త హాబీ ఏంటో తెలుసా ?
