మనకు తెలిసి నటినటుల ఫోటోలు ప్రమోషన్స్ కోసం వాడుకొవాలి అంటే, దానికి ముందు చాలా పర్మిషన్‌లు ఉంటాయి . కానీ కొంతమంది ఎలాంటి ఇన్‌ఫర్‌మెషన్ కూడా లేకుండా వాడుకుంటారు. కొంత మంది లైట్ తీసుకున్నప్పటికి, మరి కొంత మంది నటీనటులు సీరియస్‌గా రియాక్ట్ అవుతారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా,సోషల్ మీడియా ఫోటోలు తన అనుమతి లేకుండా, కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఉపయోగించబడినట్టూ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అనుమతి లేకుండా నా ఫోటోలు ఎలా ఉపయోగించారు? అని ప్రశ్నిస్తూ, వాటిని వెంటనే తొలగించండి, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read : Mrunal Thakur : అనుష్క శర్మ పై మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు
సోనాక్షి తెలిపినట్లే, “నేను ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటాను. కొన్ని బ్రాండెడ్ వెబ్‌సైట్‌లలో నా ఫొటోలు చూసి షాక్ అయ్యాను. నన్ను సంప్రదించకుండా, కనీసం నా అనుమతి లేకుండా నా చిత్రాలను ఎలా ఉపయోగిస్తారు? ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. నేను కొత్త దుస్తులు, ఆభరణాలు ధరించగా వాటికి బ్రాండ్ క్రెడిట్ ఇస్తూ షేర్ చేస్తాను. కానీ ఇలా అనుమతి లేకుండా ఫోటోలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. నా ఫోటోలను తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అని నటి పేర్కొన్నారు. ఇక న్యూస్ కాస్త వైరల్ అవుతుంది. ఇక మూవీస్ విషయానికి వస్తే పాపులర్ వెబ్‌సిరీస్ ‘హీరామండీ’తో ఓటీటీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సోనాక్షి, తాజాగా ‘నికితా రాయ్’ చిత్రంలో కూడా నటించారు.
