సెవెన్ హిల్స్ బ్యానర్ పై వేణు దారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా నటిస్తుండగా పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి జంటగా నటించారు. జులై 4వ తేదీన వెండి ధరపై ప్రేక్షకులను పలకరించనున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇటీవలే భారతదేశ రక్షణాదనం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.
Also Read:Viratapalem: PC Meena Reporting: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్
ఈ సందర్భంగా మురళి నాయక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ… “మేము ఎంతో పేద కుటుంబం నుండి వచ్చాము. మాకు ఉన్న ఒక్క కొడుకు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. మా కొడుకు ఈరోజు మాకు దూరమైనప్పటికీ గౌతమ్ లాంటి మరొక కొడుకు మాకు దొరికాడు అనుకుంటాము. గౌతమ్ మాట్లాడుతుంటే మా అబ్బాయి మాట్లాడుతున్నట్లే ఉంది. అందుకే నేడు వేరే పని ఉన్నా కూడా కేవలం ఈ చిత్రం కోసం వచ్చాము. గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ రాబోతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము” అన్నారు.
Also Read:Malavika: ప్రభాస్ బాగా మాట్లాడతారు!
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… “ఈ చిత్ర కథ మధ్య తరగతి కుటుంబాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం. నా మొదటి సినిమా అంతగా ఆదరణ పొందని సమయంలో బిగ్ బాస్ కు వెళ్లే ముందు నన్ను నేను అన్వేషించుకున్నాను. అలా బయట చాలా సాధారణంగా అన్ని ఎమోషన్స్ ఉండేలా ఒక చిత్రం చేయాలని అనుకున్నాను. ఆ విధంగా ఈ చిత్రం మొదలైంది. ఈ కథ విన్న వెంటనే సతీష్ గారు తనకు ఉన్న ప్యాషన్ తో సినిమాను ఓకే చేయడం జరిగింది. ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొడితే అది ఎన్నో తరాలపాటు గుర్తింపుతోందని మేము నమ్మాము. మీ చిత్రానికి పెద్దవారు ఎవరు పని చేయనప్పటికీ చిత్రంలో కంటెంట్ హీరోగా నిలుస్తుంది. ఈ సినిమాలో నేనే కాదు, నా పాత్ర ఎవరు పోషించినా కూడా సినిమా మంచి హిట్ అవుతుంది ఎందుకంటే కంటెంట్ అటువంటిది. చిత్ర దర్శకుడు నవీన్ గారు సైలెంట్ గా ఉండే వ్యక్తి అయినప్పటికీ ఎంతో ప్రతిభవంతులు. ఈ ట్రైలర్ ను దయచేసి మీరంతా ప్రమోట్ చేయండి. కొత్తవారిని ఎంకరేజ్ చేయండి. ఈ కార్యక్రమానికి మురళి నాయక్ కుటుంబాన్ని ముఖ్య అతిథులుగా పిలవడానికి కారణమేంటంటే ఈ చిత్రంలో సబ్జెక్ట్ చాలా బలంగా ఉంటుంది.
చాలా చిన్న వయసులో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ లాంటి వ్యక్తి యొక్క కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని తద్వారా వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని కోరుకున్నాము. మాకు పెద్ద పెద్ద సెలబ్రిటీల కంటే ఈ కుటుంబీకులే పెద్దగా అనిపించరు. అందుకే వారిని ఆహ్వానించాము. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ప్రేక్షకులు మాత్రమే. కాబట్టి ఇకపై వీరందరి కోసం ఏదో ఒకటి చేయాలని చాలా బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. సమవర్తి అనే ట్రస్టు ద్వారా నాకు వచ్చే ప్రతి సంపాదనలోనూ సగం ఆ ట్రస్టుకు అందజేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులో సగం ఆ ట్రస్టు ద్వారా ముందుగా ఒక లక్ష రూపాయలు మురళి నాయక్ గారి కుటుంబానికి అందజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ద్వారా వీలైనంతమందికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. ప్రతి నెల నేను ఆ ట్రస్ట్ ద్వారా చేసే సహాయాన్ని నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెడతాను” అంటూ ముగించారు.
