శోభన్ బాబు.. అందగాడిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. టాలీవుడ్ లో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణలకు గట్టి పోటీగా నిలిచి కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించిన ఆయన.. సోగ్గాడిగా అభిమానుల హృదయాల్లో నిలిచి పోయారు. అయితే శోభన్ బాబు కి ఇండస్ట్రీలో ఇంత పేరు పరక్యాతలు ఉన్నప్పటికి తన వారసులను ఎవరినీ ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. కాని గత కొద్దిరోజులుగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన ఇటీవల గిన్నిస్ రికార్డు సాధించి వార్తల్లో నిలిచారు. 3డీ ల్యాపరోస్కోపీ ద్వారా ఓ మహిళ గర్భాశయంలో భారీ కణితిని తొలగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్ లోకి ఎక్కాడు. అప్పటి నుంచి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూన్నాడు వస్తోన్న సురక్షిత్. ఇందులో భాగంగా..
Also Read : Bollywood : యష్ కి జోడీగా కాజల్..
తాజాగా యూట్యూబ్ ఛానల్ భాగంగా తన తాతకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తున్నారు. సురక్షిత మాట్లాడుతూ.. ‘శోభన్ బాబు తన కుటుంబ సభ్యులను సినిమా ఇండస్ట్రీకి వద్దని చెప్పలేదు, కానీ ఆయన కష్టాన్ని చూసి మేము ఆ ప్రయత్నం చేయలేదు. నాకు చాలా పెద్ద పెద్ద ఆఫర్ లు కూడా వచ్చాయి. కానీ చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని తాతగ కోరుకున్నారు, ఆయన ఆశయాల మేరకు నేను నడుచుకుంటూ డాక్టర్ అయ్యా. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్న అది చాలు.
