NTV Telugu Site icon

Sai Pallavi: బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. ఫుల్ ఖుష్‌లో ఫ్యాన్స్

Sai Pallavi

Sai Pallavi

నేచులర్ బ్యూటీ సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ని పలకరించి రెండేళ్లు అవుతోంది. చివరగా నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో కనిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌తో సాయి పల్లవి నెక్ట్స్ సినిమాలపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఏ జోరులో సినిమాలు చేస్తుందో.. నెక్ట్స్ ఎలాంటి స్క్రిప్ట్‌తో వస్తుందా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తి కనబరిచారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసింది. లవ్‌స్టోరీ తర్వాత ఏ తెలుగు ప్రాజెక్ట్ ఒకే చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా డిసప్పాయింటింగ్‌లో ఉన్న టైంలో ఎట్టకేలకు సాయిపల్లవి తెలుగు సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Also Read: Singer Sunita Son: ట్రోల్స్‌పై సింగర్ సునీత కొడుకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..!

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్యతో హీరో వస్తున్న ‘తండేల్‌’‌లో సాయి పల్లవిని హీరోయిన్‌గా ఖరారు చేస్తూ ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అయితే ఆమె సెట్లో ఎప్పుడు అడుగుతుంది, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా? ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో వారిని ఫుల్ ఖుష్ చేసే అప్‌డేట్ వచ్చింది. తాజాగా సాయి పల్లవి తండేల్ సెట్లో అడుగుపెట్టిందట. షూటింగ్ అనంతరం సంధ్యా సమయంలో బీచ్ వ్యూ‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక లోని గోకర్ణ ప్రాంతంలో నిర్వహించింది మూవీ టీం.

Also Read: PM Modi: ప్రధాని మోడీ అయోధ్య పర్యటన.. రూ. 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం

అక్కడ బీజ్ తీరంలో సాయి పల్లవి, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం ప్రకృతి అందాలు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా బీచ్ వ్యూ.. సూర్యాస్తమయం, సూర్యోదయాలు ఇక్కడ అద్భుతంగా ఉంటాయి. దాంతో షూటింగ్ విరామ సమయంలో సాయంత్రం సూర్యాస్తమయం వేళ అక్కడి బీచ్ అందాలను ఎంజాయ్ చేసింది సాయి పల్లవి. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీలో సాయి పల్లవి సత్య అనే పల్లెటూరి అమ్మాయిలో పాత్రలో అలరించబోతుంది. ఇందులో నాగచైతన్య జాలరిగా రాజు పాత్రలో కనిపించనున్నాడు.

Show comments