Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Slum Dog 33 Temple Road: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా టబు పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ‘ఆమెతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు’ అనే క్యాప్షన్‌తో టబు లుక్‌ను పరిచయం చేసిన చిత్రబృందం.. రేపు ఉదయం 11 గంటలకు ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో టబు పాత్రపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఓ అంధుడైన బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. అయితే అతను నిజంగానే అంధుడా? లేక న్యాయం కోసం అలా నటిస్తున్నాడా? అనేది సినిమాలోని ప్రధాన సస్పెన్స్‌గా ఉండనుందని సమాచారం. స్లమ్స్‌లో నివసించే పేదలు, అనాథలను క్రిమినల్ గ్యాంగుల నుంచి కాపాడే వ్యక్తిగా అతని పాత్రను పూరీ జగన్నాథ్ తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి.నారాయణరావు కొండ్రొల్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా టబు పాత్రకు ఇచ్చిన హైప్ చూస్తుంటే.. సినిమాలో ఆమెది కీలకమైన, పవర్ఫుల్ క్యారెక్టర్ అనే అంచనాలు మొదలయ్యాయి.
Also Read
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
తాజావార్తలు
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!