NTV Telugu Site icon

SKN: తెలుగు హీరోయిన్ల గురించి సరదాగా అన్నా.. వీడియో రిలీజ్ చేసిన ఎస్కేఎన్

Skn

Skn

తాజాగా జరిగిన ప్రదీప్ రంగనాధన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా హీరోయిన్ కాయాదు గురించి మాట్లాడుతూ తాము ఇతర బాషల హీరోయిన్లను ఇష్టపడతామని, తెలుగు వారికి అవకాశం ఇక ఇవ్వకూడదని అనుకుంటున్నామని అర్ధం వచ్చేలా మాట్లాడాడు. ఆ విషయం మీద వివాదం రేగింది. అసలు అలా ఎలా మాట్లాడతారు అంటూ కొంతమంది ఆయనని విమర్సిసితున్న క్రమంలో ఓ వీడియో రిలీజ్ చేశారు ఎస్కేఎన్. ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్దిమంది నిర్మాతలలో నేను ఒకడిని.

Pushpa 2 : పుష్ప- 2 లేటెస్ట్ కలెక్షన్స్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్

రేష్మ, ఆనంది, ప్రియాంక జవాల్కర్, మానస, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, ఖుషిత అనే తెలుగు అమ్మాయిలను నేను నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశాను. అలాగే హారిక అనే అమ్మాయితో పాటు మరో తెలుగు అమ్మాయితో కూడా ఇప్పుడు పని చేస్తున్నా. అలాగే ఈషా రెబ్బా, ప్రియవడ్లమని, ఇనయ లాంటి అమ్మాయిలతో కూడా నేను వర్క్ చేశా. నేను పని చేసిన 80% మంది హీరోయిన్లు తెలుగు అమ్మాయిలే. నేనొక టార్గెట్ పెట్టుకున్నా, 25 మంది తెలుగు అమ్మాయిలను సినిమాలోని వివిధ రంగాల్లో నా ద్వారా అవకాశం కల్పించాలని. నేను సరదాగా మాట్లాడిన మాటని ఒక స్టేట్మెంట్ లాగా స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత మంది తెలుగు అమ్మాయిలను పరిచయం ఎవరూ చేయలేదు. సరదాగా అన్నాను, సరదాగా తీసుకోండి అని ఆయన చెప్పుకొచ్చారు.