SKN Bought Auto to a Womans Family in Pithapuram: ఛారిటీ యాక్టివిటీస్ లో ముందుండి మంచి పేరు తెచ్చుకున్న వైరల్, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే విషయాలపై స్పందించి సహాయం చేస్తుంటారు. తాజాగా ఆయన పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే మహిళకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. ఏపీలో ఎన్నికల సమయంలో పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే మహిళ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారికి పార్టీ ఇస్తానని సంతోషంగా యూట్యూబ్ ఛానెల్ తో చెప్పింది. అయితే ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎస్కేఎన్ దృష్టికి వచ్చాయి.
Praneeth Hanumanthu : చంచల్గూడ జైలుకు ప్రణీత్ హనుమంతు
ఆయన స్పందించి ఆమె కోరుకున్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు పిఠాపురం వెళ్లి మరియమ్మకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. మరియమ్మకు ఎస్కేఎన్ ఆటో కొనివ్వడం, ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ ఎస్కేఎన్ సేవా గుణాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎస్కేఎన్ ఆటో ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది. రిక్షా అమ్మ వద్దని చెప్పి ఆటో గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్.
A true Human Being,A true Janasainik, Tollywood Successfull Producer,A Man with Golden Heart @SKNonline Anna❤️🙏👏#SKN pic.twitter.com/mfquKJYdn3
— Manohar Royal (@IamManoharRoyal) July 11, 2024