NTV Telugu Site icon

SK : మీరు చూపించే లవ్ చాలా స్పెషల్ : శివ కార్తికేయన్

Siva (2)

Siva (2)

ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Also Read : Naagi : కల్కి – 2 కి చాలా టైమ్ పడుతుంది

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ ‘అందరికీ నమస్కారం. మీ అందరి ప్రేమకి థాంక్యూ. మిమ్మల్ని మళ్ళీ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నేనెప్పుడూ ఇక్కడికి వచ్చినా మీరు చూపించే లవ్ చాలా స్పెషల్. అందుకే మా టీం ఈసారి ఇలాంటి స్పెషల్ మూవీ తో వస్తున్నాం. ఇదొక రియల్ హీరో స్టోరీ. మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెకా ట్రూ స్టోరీ. అమరన్ ఒక సోల్జర్.. లవ్ డ్యూటీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో డైరెక్టర్ రాజకుమార్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో నేను మేజర్ ముకుంద్ రోల్ చేశాను. ఇందుగా సాయి పల్లవి నటించింది. సాయి పల్లవి గారు ఎంత మంచి పెర్ఫార్మర్ అందరికీ తెలుసు. ఇందులో అద్భుతంగా చేశారు. ఈ సినిమాను  తెలుగులో రిలీజ్ చేస్తున్న సుధాకర్ రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. మై స్పెషల్ విషెస్ టు నితిన్ బ్రదర్. మీలాంటి స్పెషల్ ఆడియన్స్ ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి రియల్ హీరో స్టోరీస్ ఇంకెన్నో వస్తాయి.  లవ్ యు ఆల్’ అని అన్నారు.