NTV Telugu Site icon

SK : తమిళనాడు నెక్ట్స్ సూపర్ స్టార్ గా శివ కార్తికేయన్..?

Amaraaan

Amaraaan

దీపావళి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో పలు సినిమాలు విడుదల అయ్యాయి. దాదాపుగా విడుదలైన అన్ని సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా ఊహించిన దాని కంటే కూడా కలెక్షన్స్ రాబట్టాయి. తెలుగులో విడుదలైన సినిమాలను గమనిస్తే కిరణ్ అబ్బవరం ‘క’ ఈ హీరోకు మొదటి రోజు కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలబెట్టింది. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ దీపావళి సినిమాలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Also Read : VenkyAnil3 : సంక్రాంతికి వస్తున్న వెంకీ – అనిల్ రావిపూడి

ఇక తమిళ్ లో రిలీజ్ అయిన శివకార్తికేయన్ తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డు సాధించింది. తమిళ స్టార్ హీరోలలో విజయ్ ఒకరు. రిలీజ్ రోజు విజయ్ సినిమాలకు తమిళ్ లో రికార్డు స్థాయి ఓపెనింగ్ వస్తుంది. కాగా విజయ్ రీసెంట్ సినిమా గోట్. మొదటి రోజు బుకింగ్స్ లో జోరు చూపించింది. ఈ సినిమా బుకింగ్స్ ను శివ కార్తికేయన్ అమరన్ దాటడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బుక్ మై షోలో సగటున ఒక గంటలో GOAT సినిమాకు 32.2K టికెట్స్ బుక్ అవ్వగా శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమాకు గాను 32.6K బుక్ అయ్యాయి. ఈ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. కోలీవుడ్ తర్వాతి సూపర్ స్టార్ శివ కార్తికేయన్ అంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments