NTV Telugu Site icon

SivaKarthikeyan : ‘అమరన్’ సినిమా చేయడానికి కారణం ఎవరంటే..?

Amaran (2)

Amaran (2)

ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టీం ‘అమరన్’ బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. అమరన్ మూవీని థియేటర్స్ లో చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరికీ థాంక్యు. ఆంధ్ర, తెలంగాణలో చాలామంది సినిమా చూసి ఎమోషనల్ ఏడుస్తున్న వీడియోస్ చూశాను. మీ అందరికీ మూవీ ఈ రేంజ్ లో కనెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీ.

Also Read : NaniOdela2 : దసరా దర్శకుడితో నాని నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదే

మేజర్ వరదరాజన్ క్యారెక్టర్ చేయడానికి ముఖ్యమైన కారణం మా నాన్న. ఎందుకంటే ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్. ఆయనకి, ముకుంద్ క్యారెక్టర్ కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ మూవీ మా నాన్నకి ఒక ట్రిబ్యూట్. ఈ సినిమాని ఇంత స్పెషల్ గా మార్చిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో చాలా మంచి కలెక్షన్స్ చేస్తుందని డైలీ కాల్స్ వస్తున్నా. సినిమాని బిగ్ రిలీజ్ చేసిన సుధాకర్ గారికి థాంక్యూ. సునీల్ గారికి థాంక్యూ . డైరెక్టర్ రాజ్ కుమార్ కి థాంక్యూ. టీవీ డేస్ నుంచి మాకు పరిచయం ఉంది. తను బ్రిలియంట్ రైటర్ డైరెక్టర్. ఈ సినిమాతో అది ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాకి ఏ అవార్డు వచ్చినా అది ఫస్ట్ రాజ్ కుమార్ కి దక్కాలి. సాయి పల్లవి తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మేం కలిసి చేసిన ఫస్ట్ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావడం ఆనందాన్నిచ్చింది. ఇందు, ముకుంద క్యారెక్టర్స్ కి ఆడియన్స్ చాలా గొప్పగా కనెక్ట్ అవుతున్నారు. మా టీంలో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మంచి కంటెంట్నే చూస్తారు. అది అమరన్ తో మరోసారి ప్రూవ్ అయింది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థాంక్యూ.

Show comments