Site icon NTV Telugu

Devara Pre Release Event: దేవర ‘విధ్వంసం’.. అద్దాలు పగలకొట్టిన ఫాన్స్?

Devara Pre Release Event

Devara Pre Release Event

Situation Got Out Of Control In Novotel for Devara Pre Release Event: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతుంద. రిలీజ్ కి సమయం దగ్గర పడటంతో ప్రమోషన్లలో వేగం పెంచిన సినిమా యూనిట్ ఈరోజు హైదరాబాద్ నోవోటేల్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు సిద్ధమైంది. నిజానికి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్లో చేయాలనుకున్నారు. వర్షం భయంతో క్లోజ్డ్ ఆడిటోరియానికి ఈవెంట్ ని మార్చాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే కొంతమంది అభిమానులకు ఫ్యాన్స్ పాసులు, విఐపి పాసులు, ఎంఐపి పాసులు జారీ చేశారు. అయితే పాసులు దక్కని అభిమానులు లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో హోటల్లోని అద్దాలు దోషమైనట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi: బ్రేకింగ్: గిన్నీస్ బుక్ లోకి చిరంజీవి

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా దర్శకులు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ హాజరు కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన కీలకమైన విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాని కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ ఈ సినిమాకి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో యువ నిర్మాత నాగ వంశీ ఈ సినిమా హక్కులను రెండు తెలుగు రాష్ట్రాలకు గాను భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్నారు..

Exit mobile version