Site icon NTV Telugu

ఏ1 ఎక్స్ ప్రెస్ : ‘సింగిల్ కింగులం’ వీడియో సాంగ్

Single Kingulam Video Song from A1 Express

యంగ్ హీరో సందీప్ కిషన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. తమిళంలో విజయవంతమైన ‘నట్పే తునై’ చిత్రానికి రీమేక్‌ ఇది. తమిళంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ పేరుతో హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రీమేక్ చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న హాకీ గ్రౌండ్‌ను కాపాడుకోవడానికి ఓ కోచ్ చేసే ప్రయత్నానికి నిషేధింపబడ్డ ఓ నేషనల్ హాకీ ప్లేయర్ ఏ విధంగా దోహదకారి అయ్యాడు అన్నదే ఈ చిత్ర కథాంశం. అయితే మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఈ చిత్రంలోని ‘సింగిల్ కింగులం’ సాంగ్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ నుంచి ‘సింగిల్ కింగులం’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. రాహుల్ సింప్లిగంజ్ ఈ సాంగ్ ను ఆలపించగా… సామ్రాట్ లిరిక్స్ అందించాడు. హిప్ హాప్ తమిజా సంగీతాన్ని అందించారు. ఈ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Exit mobile version