NTV Telugu Site icon

Tulsi Kumar: షూటింగ్‌లో ఘోర ప్రమాదం: వెంట్రుక వాసిలో తప్పించుకున్న నటి.. వీడియో వైరల్

Tulsi Kumar Accident

Tulsi Kumar Accident

Singer Tulsi Kumar meets with an accident on set: బాలీవుడ్ నటి, ప్రముఖ గాయని తులసి కుమార్ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నిజానికి, తులసి కుమార్ తన కొత్త మ్యూజిక్ వీడియో కోసం సెట్‌లో కెమెరా ముందు నటిస్తోంది. ఈ సందర్భంగా, ఆమె వెనుక బ్యాక్‌డ్రాప్‌లో ఒక సెట్ ప్రాపర్టీ పడిపోవడం చూడవచ్చు. పడిపోతుండగానే నటి పరుగున పక్కకు తప్పుకుంది. తులసికి బాగా నొప్పులు రావడం వీడియోలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో తులసి కెమెరా ముందు నిల్చొని షూటింగ్‌కి రెడీ అవుతోంది. కానీ అకస్మాత్తుగా ఆమె వెనుక భాగం పడిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నారు.

Dhanush- Aishwarya: ఐశ్వర్య-ధనుష్‌ విడాకులు.. కోర్టుకు ఇద్దరూ డుమ్మా?

ఇంతలో నటి భయాందోళనతో అక్కడి నుంచి పరుగెత్తింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వారు కూడా షాక్ కి గురయ్యారు. నటి వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఉండకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని వీడియోలో అర్ధం అవుతోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోలో తులసి రియాక్షన్ కూడా రికార్డవ్వడంతో ఆమె హర్ట్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆమె గాయంపై ఎలాంటి సమాచారం లేదు. వీడియో చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. తులసి కుమార్ నేపథ్య గాయని, రేడియో జాకీ, సంగీత విద్వాంసురాలు అలాగే బాలీవుడ్ నటి. ఆమె చిత్రనిర్మాత భూషణ్ కుమార్, నటి ఖుషాలి కుమార్ సోదరి. ఆమెకు కిడ్స్ హట్ అనే YouTube ఛానెల్‌ ఉంది. నర్సరీ రైమ్‌లు- కథలతో సహా పిల్లల కంటెంట్‌ను కలిగి ఉన్న T-సిరీస్ అనే రికార్డ్ లేబుల్‌ని కలిగి ఉంది.

Show comments