Site icon NTV Telugu

Simran : ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్స్‌ ఎప్పటికీ స్నేహితులు కాలేరు..

Simran

Simran

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సిమ్రాన్.. ఏదో నాలుగు సీన్స్‌ కోసం స్క్రీన్‌పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రల్లో నటించడమే ఉత్తమమంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్‌ను ఎవ్వరిని ఉద్దేశించి అన్నది అనే విషయం పక్కన పెడితే ఈ మాటలు దూమరం లేపాయి. అయితే తాజాగా సిమ్రాన్ మరోసారి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.

సిమ్రాన్ మాట్లాడుతూ.. ‘నా తోటి నటి చేసిన కామెంట్స్‌ నన్నెంతో బాధించాయి. ఆ బాధతోనే ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో నాకు అనిపించింది చెప్పాను. ఒక్కప్పుడు నా కెరీర్‌ ఎలా ఉందో మీకు తెలుసు. ప్రజంట్ అడపాదడపా ఆంటీ రోల్స్‌లో యాక్ట్‌ చేస్తున్నాను.. అలా యాక్ట్‌ చేయడంలో తప్పేముంది. ఆ రోల్స్‌ నాకు ఇష్టమే. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్‌ ఎప్పటికీ స్నేహితులు కాలేరు. నాకు ఎదురైన అనుభవంతో అది మరోసారి నిరూపితమైంది. స్నేహితులనుకున్నవాళ్లు కొన్ని సందర్భాల్లో తమ కామెంట్స్‌తో మనల్ని ఎంతో బాధిస్తారు. ఆ అవార్డుల కార్యక్రమం తర్వాత ఆ నటి నాకు మరోసారి ఫోన్‌ చేసింది. నేను ఏమీ ఇబ్బందిపడలేదు కానీ, ఆమెతో అంతకుముందు ఉన్న రిలేషన్‌ ఇప్పుడు లేదు అంతే..’ అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది. కానీ ఇంతకీ ఎవరా నటి అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Exit mobile version