ప్రజంట్ విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా చెన్నైలో థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఏ ఆర్ రెహమాన్ లైవ్ పర్ఫామెన్స్ తో ఆదరగొట్టగా, ఇందులో శృతి హాసన్ కూడా పాల్గోన్నింది. అయితే ఈ ఈవెంట్ లో భాగంగా హీరో శింబు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి..
Also Read : AlluArjun : అల్లు అర్జున్ అట్లీ మూవీలో నాని హీరోయిన్.. ?
‘నా సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. కష్టకాలంలో నా తల్లిదండ్రులు ఎంతో అండగా నిలిచారు, ధైర్యం చెప్పారు. కానీ నటుడిగా స్ఫూర్తి నింపిన వ్యక్తి మాత్రం కమల్ హాసన్. చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నటుడిగా నన్ను నేను మలచుకున్నాను. నాకే కాదు నాలాంటి ఎంతోమందికి ఆయనే స్ఫూర్తి, ఒకానొక సమయంలో నేను వరుస చిత్రాలు చేస్తున్నప్పుడు.. కమల్ హాసన్‌ను రీప్లేస్ చేసే నటుడు వచ్చాడంటూ చాలామంది కామెంట్స్ చేశారు. కానీ నిజం చెప్పాలంటే ఆయన్ని ఎవరూ రీ ప్లేస్ చేయలేరు నా దృష్టిలో ఆయనొక గొప్ప నాయకుడు’ అంటూ శింబు కన్నీళ్లు పెట్టుకున్నారు.. అలాగే గతంలో సంఘటన గుర్తు చేసుకుంటూ..
Also Read : Balagam : బలగం నటుడు కన్నుమూత..
‘జరిగిన కొన్ని సంఘటనల కారణంగా నాతో వర్క్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. సినిమాల్లేక కష్టంగా అనిపించింది. అలాంటి సమయంలో నన్ను నమ్మి నాతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి దర్శకుడు మణిరత్నం. ‘థగ్ లైఫ్’ కోసం ఆయన నిర్మాణ సంస్థ (మద్రాస్ టాకీస్) నుంచి ఫోన్ చేసినప్పుడు తొలుత నమ్మలేదు. తర్వాత ఆయన్ని కలిసినప్పుడు ‘నిజంగా మీరు నాకు ఫోన్ చేశారా?’ అని అడిగా. ఆయన తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ లో నటించలేకపోయిన నాకు ‘థగ్ లైఫ్’ లో అవకాశం ఇచ్చారు. ఆయన ఎప్పటికీ నా గురువు, గాడ్ ఫాదర్’ అని శింబు వివరించారు.
