NTV Telugu Site icon

Thug Life : “థగ్ లైఫ్” స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. శింబు స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా…

Whatsapp Image 2024 05 08 At 12.23.48 Pm

Whatsapp Image 2024 05 08 At 12.23.48 Pm

విశ్వనటుడు కమల్‌హాసన్‌ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్‌ లైఫ్‌’.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కమల్ హాసన్ 234 వ చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ మూవీని కమల్ హాసన్‌,ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌, రెడ్ జియాంట్ మూవీస్‌ మరియు మద్రాస్ టాకీస్‌ బ్యానర్లపై కమల్‌ హాసన్‌,ఆర్ మహేంద్రన్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే థగ్‌ లైఫ్‌ మూవీలో కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఈ మూవీలో ఐశ్వర్యలక్ష్మి, త్రిష హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, దుల్కర్ సల్మాన్‌ మరియు జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.కొత్త థగ్‌ కు స్వాగతం పలికే సమయం వచ్చింది అంటూ మేకర్స్ నిన్న స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.తాజాగా “సిగ్మా థగ్‌ రూల్” ఏంటో  మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు.తాజాగా ఈ సినిమాలో శింబు పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు.అందులో న్యూ థగ్ వచ్చేసాడు అంటూ  శింబు స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. చేతిలో గన్ పట్టుకొని శింబు స్టైలిష్‌ ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఢిల్లీలోని సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిర్‌లో జరుగుతుంది.

Show comments