NTV Telugu Site icon

సింగిల్ టేక్ లో శింబు సిక్స్ మినిట్స్ షాట్

Simbu acting 6 minute within single take to Manadu Movie

హీరోగా కంటే వివాదాలతోనే ఎక్కువగా పేరు సంపాదించాడు తమిళ నటుడు శింబు. ప్రత్యేకించి ప్రేమ వ్యవహారాలకు ఇతగాడు పెట్టింది పేరు. అందుకే కెరీర్ లో వెనకబడ్డాడు శింబు. తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ సినిమాలో నటిస్తున్నాడు శింబు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో శింబుకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాచి తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో శింబు ముస్లిం యువకుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఆరు నిమిషాల నిడివి ఉన్న ఓ షాట్ ను సింగిల్ టేక్ లో చేసి శెహభాష్ అనిపించుకున్నాడు శింబు. ఈ షాట్ లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్సన్ తోపాటు ఎస్.జె.సూర్య కూడా పాల్గొన్నారు. భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య వంటి దర్శకులు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.