NTV Telugu Site icon

Simba Movie: మొక్కలు నాటండి.. ఫ్రీగా సింబా సినిమా చూసేయండి!

Simba Offer

Simba Offer

Simba Movie Team offer : అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘సింబా’ సినిమాను సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించగా ఆగస్ట్ 9న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ‘సింబా చాలా కొత్త కథ, కొత్త పాయింట్‌తో రాబోతోంది. సంపత్ నంది గారు అద్భుతంగా కథ రాశారు. నేను దర్శకత్వం వహించాను. ఇంత మంచి ప్రాజెక్ట్‌ను రాజేందర్ గారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్ ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

Anchor Suma: స్టేజ్ మీద సుమ చేతిని ముద్దాడిన నటుడు.. షాకింగ్ కామెంట్స్

ఇక ఈ క్రమంలో నటుడు శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరూ మొక్కని నాటి సోషల్ మీడియాలో నాకు ఫోటోలు పంపండి, సినిమా టికెట్లు నేను పంపిస్తాను. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి, ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండని అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ.. ‘ఈ మూవీ మొదలవ్వడానికి కారణం ఉదయభాను అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తరువాత సంతోష్ గారు, కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నా. అలాంటి టైంలోనే ఈ కథ విన్నా. అందరికీ కనువిప్పు కలిగేలా, ఎంటర్టైన్ చేసేలా, మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం ఆగస్ట్ 9న రాబోతోంది. ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమాను చూస్తే వందకు వంద మార్కులు వేస్తారు’ అని అన్నారు.

Show comments