Site icon NTV Telugu

Silk Smitha: వేలంలో సిల్క్ స్మిత కొరికిన ఆపిల్.. ఎంత పలికిందో తెలిస్తే షాకే!

Silk-Smitha

Silk-Smitha

Silk Smitha Biten Apple News: తెలుగు ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 90 లలో ఒక ఊపు ఊపిన ఆమె గురించి చాలా మందికి తెలియదు. కనీస చదువు కూడా లేకుండా విజయలక్ష్మి అనే ఒక అమ్మాయి సిల్క్ స్మితగా ఎదిగిన తీరు ఒక బయోపిక్ తీసేలా చేసింది. నటిగా, డాన్సర్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో మలయాళ సినిమాల్లో నటించిన ఆమె తర్వాత తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో సైతం నటించి మెప్పించింది. ఐటెం భామగా జ్యోతిలక్ష్మి, జయలక్ష్మి వంటి డాన్సర్స్ ని సైతం బీట్ చేసి కొన్నాళ్లపాటు రాజ్యం ఏలింది. ఆమె ఎక్కువగా కామెడీ, విలన్ తరహా పాత్రలలోనే కనిపించారు. అయితే ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ కి నిదర్శనంగా ఒక ఘట్టం నిలుస్తోంది ఆ వివరాలు మీకోసం.

CM Chandrababu: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట

ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా షాట్ గ్యాప్ లో సిల్క్ స్మిత ఆపిల్ కొరికిందట. వెంటనే షాట్ రెడీ అనడంతో తింటున్న ఆపిల్ పక్కన పెట్టి కెమెరా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన సెట్ లోని ఒక బాయ్ ఆపిల్ తీసుకుని సిల్క్ స్మిత కొరికిన ఆపిల్ అంటూ వేలం వేస్తే దాన్ని కొనేందుకు సినీ జనం ఎగబడ్డారని తెలుస్తోంది. సిల్క్ స్మిత కొరికిన ఆ యాపిల్ని వేలంలో ఎంతకు కొన్నారు అనే విషయం మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. కొంతమంది రెండు లక్షలు పలికిందని అంటుంటే కొంతమంది మాత్రం 200 మాత్రమే అని అంటారు. ఇంకొంతమంది పాతికవేల రూపాయలకు కొనుగోలు చేశారని అంటారు ఏది ఏమైనా ఇలా వేలం వేయాలని ఆలోచన రావడమే ఆసక్తికరమైన విషయం. దానికి ఎంత పలికినా అసలు వేలం వేయటమే గొప్ప విషయం కాబట్టి ఆమె క్రేజ్ కి అదే నిదర్శనం అని చెప్పొచ్చు.

Exit mobile version