Siddhugadi Love Story : ఆసక్తికరంగా ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సరికొత్త ప్రేమకథలతో వచ్చే చిన్న చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా అదే కోవలో ఒక బ్యూటిఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. రమేష్ చెరుకూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత గ్రాండ్‌గా జరిగింది. సొంత ఊరిని వదిలి సుదూర తీరాలకు వెళ్లిన ఎంతోమంది ఎన్ఆర్ఐల (NRIs) జీవితాలకు, వారి భావోద్వేగాలకు అద్దం పట్టే కథాంశంతో వస్తున్న సరికొత్త చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. మనోజ్ కుమార్, మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ చెరుకూరు దర్శకత్వం వహిస్తున్నారు. సావిత్రమ్మ నిర్మాణంలో.. వి. సాంబశివరావు, వేణు గోపాల చారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, వి.ఎన్. ఆదిత్య, వి. సముద్ర, రామ్ ప్రసాద్‌లతో పాటు నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, నటుడు అశోక్ కుమార్, రాజేందర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ ఈవెంట్లో హీరో మనోజ్ కుమార్ సినిమాలోని ఇంట్రెస్టింగ్ పాయింట్‌ను లీక్ చేస్తూ క్రేజీ కామెంట్స్ చేశారు. “ఈ కథ దూర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరి లైఫ్ కు కనెక్ట్ అవుతుంది. సినిమాలో నా ఇద్దరు హీరోయిన్లు రెండు భిన్నమైన సంస్కృతులకు ప్రతీకగా కనిపిస్తారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు అద్దం పడుతూ ‘ముద్దపప్పు-ఆవకాయ’ లాగా చాలా హోమ్లీగా ఉంటే.. మరొకరు తెలంగాణ ఫ్లేవర్‌ను చూపిస్తూ ‘హైదరాబాదీ బిర్యానీ’ లాగా చాలా స్పైసీగా, ఎనర్జిటిక్‌గా నటించారు” అని చెప్పి సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు.
Also Read
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
- Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న 'ఆపరేషన్ గంగా'
- Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!